Vidya Lakshmi Educational Scheme

Vidya Lakshmi Educational Scheme

Government-of-india-launches-vidya-lakshmi-educational-scheme


పేద, మధ్య తరగతి విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులు చదువుకునే ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడేవారు ఉన్నారు.. ఉన్నత విద్య, విదేశాల్లో చదువు కోసం గతంలో విద్యార్థులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.. సిఫార్సులు, ఆస్తిపాస్తులు, లేదా ఉద్యో పూచికత్తులు సమర్పించాల్సి వచ్చేది.. అయినా రుణం మంజూరవుతుందో లేదో తెలియని పరిస్థితి ఉండేది.. ప్రస్తుతం అవేమీ అక్కర్లేదు. ‘విద్యా లక్ష్మి’ పథకం ఉన్నత చదువులకు చేయూతనిస్తోంది..
పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం 2015-16లో కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అప్పటి నుంచి ఏటా కేటాయింపులు జరుగుతున్నాయి. చదువుకు సంబంధించిన వివరాలు వాస్తవికతతో కూడి ఉంటే చాలు. ఇంటివద్దకు రుణం వస్తుంది. చాలా మందికి ఈ పథకంపై అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. విద్యారుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలనే అపోహ విద్యార్థుల్లో ఉంది. ఆ అవసరం లేకుండానే ఇంటి నుంచే దరఖాస్తు చేసుకొని రుణం పొందే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌(ఏబీఎ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ-గవర్నర్స్‌ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిరంతం పర్యవేక్షిస్తున్నారు.
ఏయే చదువులకు...
ఇంటర్‌, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పీజీ డిప్లొమా ప్రొఫెషనల్‌ కోర్సులు, కాస్ట్‌ అకౌంటెన్సీ, చార్టర్డ్‌ అకౌంట్‌, ఐఐఎం మేనేజ్‌మెంట్‌, ఐఐటీ, వృత్తి విద్యా కోర్సులు, విమానయాన రంగానికి సంబంధించి ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులకు రుణాలు ఇస్తారు. యూజీసీ, ఏఐసీటీఈ ఇతర ప్రభుత్వ అధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి మాత్రమే రుణాలు అందుతాయి.
ఎంతవరకు రుణం..
విద్యాలక్ష్మి పథకం ద్వారా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందులో రూ.4.5 లక్షల వరకు రుణానికి కేంద్ర ప్రభుత్వమే వడ్డీ భరిస్తుంది. అమ్మాయిల చదువును ప్రోత్సహించడంలో భాగంగా విద్యార్థిణులకు మరింత రాయితీ కల్పిస్తున్నారు. రుణం రూ.7.5 లక్షలు దాటితే పూచికత్తు ఉండాలి.
దరఖాస్తులు ఇలా...
విద్యా రుణం కోసం మూడు పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. మొదటగా విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదవ్వాలి. ఆ తర్వాత వివరాలతో కూడిన దరఖాస్తు పూర్తిచేయాలి. చివరగా వివిధ రకాల బ్యాంకుల్ని ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయితే రుణానికి సంబంధించిన వివరాలు చరవాణి, ఈ మెయిల్స్‌కు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది.
జాతీయ ఉపకార వేతనాలకు సైతం..
విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా జాతీయ ఉపకార వేతనాలకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసిన వారిని ఈ పోర్టల్‌లో అనుసంధానం చేయడంలో భాగంగా ప్రతిభా ఉపకార వేతనాల వివరాలను పొందుపరుస్తున్నారు. రుణాలు, ఉపకార వేతనాలు అందుకొని జీవితంలో స్థిరపడిన వారి స్ఫూర్తిదాయక గాథల్ని ప్రేరణగా పలు పేజీల్లో ఉంచారు.
రుణం పొందేందుకు నమోదు ఇలా...
పోర్టల్‌లో నమోదు ఇలా కావాలి. ‘‘హెచ్‌టీటీపీఎస్‌ //డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.విద్యాలక్ష్మి.కో.ఇన్‌/స్టూడెంట్స్‌’’ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. ముఖపేజీలోని రిజిష్టర్‌ బ్లాక్‌ను క్లిక్‌ చేయాలి. అందులో అడిగిన వివరాలను నమోదు చేయాలి. ఒక విద్యార్థి ఒకేసారి గరిష్ఠంగా మూడు బ్యాంకులకు విద్యా రుణాల కోసం దరఖాస్తు
చేసుకునే వెసులుబాటు ఉంది.
ఇవి జతచేయాలి
విద్యాలక్ష్మి పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద విద్యా రుణాలను పొందేందుకు విద్యార్థులు చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువీకరణ పత్రం(టీసీ). మార్కుల జాబితా. ఇంతవరకు పొందిన ఉపకార వేతనాల పత్రాలు. ఉన్నత విద్యకు సంబంధించి ర్యాంకు కార్డు, ప్రవేశ అనుమతి పత్రాలు. చదవాల్సిన కోర్సుకు సంబంధించిన ఫీజుల అంచనా వివరాలు. తల్లి, తండ్రి సంరక్షకుడు, విద్యార్థికి సంబంధించిన పాస్‌పోర్టు సైజు ఫొటోలు. విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైతే వారి వేతన ధ్రువీకరణ పత్రాలు. హామీకి సంబంధించి ఆస్తి వివరాలు, నివాస ధ్రువీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు లాంటివి జతచేయాలి.
బ్యాంకుల ద్వారా..
ఈ పోర్టల్‌లో 36 బ్యాంకులు నమోదై ఉన్నాయి. విద్యా రుణాలను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, విజయ, ఐవోబీ, యూనియన్‌, ఆంద్రాబ్యాంకు, ఐడీబీఐ, యూబీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎప్‌సీ, యూకో, దీనా, కరూర్‌ వైశ్య, సిండికేట్‌, టీఏఎబీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంకు, యాక్సిస్‌, ఫెడరల్‌, న్యూ ఇండియా, ఆర్‌బీఎల్‌, అలహాబాద్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు.


For More Deatils: www.erojunews.com/trending/government-of-india-launches-vidya-lakshmi-educational-scheme/

https://www.ntnews.com/telangana-news/vidyalakshmi-scheme-for-higher-education-students-1-1-10600975.html

https://www.eenadu.net/districts/mainnews/111191/Peddapalli/19/689

శ్రీరామనవమి

sri rama navami
శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.


శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.


చరిత్ర


రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

ఉత్సవం

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

రామ రాజ్యం

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

"ర" అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. (ఉదా: Radiance, Radium). కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయము కూడా ప్రాచీనమైనది.

ప్రశస్తం

‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ 'శ్రీరాముని’ కనుగొనుచుండవలె. 
ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.

దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు

Ref: wikipedia 
Republic Day Special Telugu mp3 songs download

Republic Day Special Telugu mp3 songs download

Movie Name : Republic Day Special – (2016)
Cast & Crew : Akshit Senani, Pallavi Shrestha
Music : Gitta Naveen Kumar
Category : Telugu Movies

Republic Day Special songs free download | Republic Day Special movie songs free download | Republic Day Special mp3 songs download

01 – Deshamante
02 – Ee Jagame Oka Aakasam
03 – Ee Jenda
04 – I Am An Indian
05 – Janaganamana
06 – Janaganamana Janayatri
07 – Janani Janma Bhoomi
08 – Maa Telugu Thalli
09 – Meme Indians
10 – Raghupathi Raghava (Male)
11 – Vaishnava Janato
12 – Vandemataram Leader
13 – Vandemataram Prathinidhi
14 – Ye Desamegina
15 – Ye Mera Jaha

Description: Republic Day Special – (2016) Telugu Movie Songs Free Download | Republic Day Special Songs Download | Republic Day Special Songs Free Download

  • Republic Day Special Songs free download Keywords:
  • Album Republic Day Special audio songs free download
  • Republic Day Special songs free download
  • Ee Jagame Oka Aakasam|| Akshit Senani|| Gitta Naveen Kumar
  • Download Telugu mp3 songs of Republic Day Special
  • I Am An Indian|| Gitta Naveen Kumar|| Pallavi Shrestha
  • Republic Day Special 2016 Album songs free download
  • Download Telugu songs track of Republic Day Special Album
  • Republic Day Special songs free download mp3 128kbps
  • Telugu Republic Day Special 2016 Album mp3 track with HQ
  • Download Republic Day Special songs free download 2016
  • Republic Day Special Telugu mp3 songs 128 kbps high quality
  • www download Republic Day Special Telugu songs
  • Download Telugu Album Republic Day Special 2016 mp3 track
  • songs free download zip file of Republic Day Special
  • Republic Day Special Telugu Album High Quality mp3 Songs
  • 2016 Telugu Album Hits Download free
  • Republic Day Special Album audio isongs download high quality
  • Republic Day Special mp3 songs free download
  • Audio songs Republic Day Special iSongs from naasongs.com
  • Republic Day Special songs download
  • Republic Day Special Album songs free download mp3 audio
  • Telugu Album Republic Day Special songs download
  • Free Republic Day Special Telugu Album itunes iSongs Download
  • Republic Day Special mp3 download
  • Album Republic Day Special 2016 audio track download with HQ
  • itunes and isongsdownload free audio songs
  • Telugu new Album Republic Day Special songs free download
  • Republic Day Special original cd digital rips free download
  • Republic Day Special Telugu mp3 Album audio songs free download
  • Telugu songs Album Republic Day Special 2016 download
  • Telugu Album sound track hits songs free download
  • Telugu Album 2016 audio track songs download with ZIP format
  • Republic Day Special individual songs direct download free
  • Download Free Republic Day Special Telugu compressed mp3 songs
  • Download Republic Day Special audio cd rips free
  • Republic Day Special mp3 songs direct download Telugu Album
  • 2016 Telugu Album audio mp3 songs free download

Markandeya Temple, Yergatla, Nizamabad

Markandeya Temple, Yergatla, Nizamabad 



Markandeya Temple, Yergatla, Nizamabad




మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం. బాలుని గానే యముని జయించి, శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు.





Bhakta Markandeya Telugu Full Movie



మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి