Nizamabad History, Telangana (నిజామాబాదు జిల్లా - చరిత్ర)

Nizamabad History, Telangana


నిజామాబాద్ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. నిజామాబాద్ నగరము ఈ జిల్లా ముఖ్య పట్టణము. నిజామాబాద్ను పూర్వము ఇందూరు మరియు ఇంద్రపురి అని పిలిచేవారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూరు ఇతర ప్రధాన నగరములు. నిజామాబాదు నగరం హైదరాబాదు, వరంగల్ తరువాత తెలంగాణాలో 3వ అతిపెద్ద నగరం.


నిజామాబాద్ జిల్లా పేరు వెనుక చరిత్ర


Nizamabad History, Telangana

నిజామాబాద్ ను 8వ శతాబ్దములో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చింది. ఇందూరుకు పూర్వం పేరు ఇంద్రపురి. ఇంద్రపురి అని ఒక రాజు పేరు మీదుగా పేరు వచ్చిందని భావించబడుతున్నది. కానీ ఆ రాజు క్రీ.శ.388 ప్రాంతంలో నర్మదా, తపతిల దక్షిణ ప్రాంతాన్ని పాలించిన త్రికూటక వంశానికి చెందిన ఇంద్రదత్తుడా, విష్ణుకుండిన చక్రవర్తి మొదటి ఇంద్రవర్మనా ఇదమిద్ధంగా తెలియడం లేదు. 20వ శతాబ్దం తొలినాళ్ళ వరకు కూడా ఈ ఊరు, జిల్లా ఇందూరుగానే పిలవబడింది. 1901వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి (సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వరకు) రైలు మార్గము ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు నిజాం-ఉల్-ముల్క్ పేరు పెట్టి, జిల్లా పేరును నిజామాబాద్ గా మార్చడం జరిగింది.

జిల్లా చరిత్ర

జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో నేటికీ చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తున్నాయి. క్రీ.పూ.3000 నాటికే జిల్లాలో మానవుల ఉనికి ఆధారాలున్నాయి. అందుకు చరిత్రకారులకు దొరికిన 'కైరన్' (చనిపోయిన వారిని వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చిపెట్టి దాని చుట్టూ కొన్ని గుర్తులను అమర్చడం)లే నిదర్శనం. దీని ద్వారానే ప్రాచీన కట్టడాలైన రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు, ముస్లిం నిర్మాణాలు తెలిశాయి.

జిల్లాలోని సంస్థానాలు:

రాజులకు సేవచేసిన కొందరికి అధిక మొత్తంలో భూమిని ధారాదత్తం చేసేవారు. అలా ఎక్కువ మొత్తంలో భూమి పొందిన వారినే సంస్థానాధీశులుగా పేరుపొందారు. సంస్థానాలు అంటే చాలామొత్తంలో ఎక్కువ గ్రామాలు అధికారి ఏలుబడి కింద ఉండడం. ముస్లిం రాజుల పరిపాలనలో అధికార భాషలుగా ఫారసీ, ఉర్దూ ఉండేవి. జిల్లాలో దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్ సంస్థానాల ఆనవాళ్ళు నేటికీ పదిలం.

 కౌలాస్

కాకతీయ సామ్రాజ్యం అంతమైన తరువాత బహమనీ సుల్తానులు కౌలస్ దుర్గాన్ని వశపరచుకున్నారు. ఈ సంస్థానానికి ఔరంగజేబు ద్వారా రాజా పథంసింగ్ గౌర్ ను కౌలాస్ సంస్థానాధీశునిగా నియమితులయ్యారు. ఇతని వారసులు స్వాతంత్ర్యం వరకు అసఫ్ జాహి నైజాం రాజులకు సామంతులుగా వారి రాజ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషించారు. రాజా దీప్ సింగ్ 1857 తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి బ్రిటీషువారిచే శిక్షకు గురయ్యాడు. శత్రు దుర్భేద్యమైన అప్పటి కట్టడాలు ఇప్పటికీ వాటి నిర్మాణ చాతుర్యాన్ని చాటుతున్నాయి.

సిర్నాపల్లి సంస్థానం

జిల్లాలో సిర్నాపల్లి సంస్థానానికి ప్రత్యేకత ఉంది. నిజాం నవాబు కాలంలో రాణి జానకీబాయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం. 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు కట్టించారు. ఆమె ఇందల్ వాయి, నిజామాబాద్ లోని సిర్నాపల్లి గడి, కోటగల్లిగడి, మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు, జానకంపేట, నవీపేట, రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు. సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైనును నిజాం నవాబు ఉప్పల్ వాయి, డిచ్ పల్లిల మీదుగా వేస్తే, ఈమె ఆ లైనును తన సిర్నాపల్లి మీదుగా వెళ్ళేలా వేయించుకున్నారు.

వెల్మల సంస్థానం

జిల్లాలో వెల్మల్ సంస్థానం పురాతనమైనది. దీని క్రింద వెల్మల్, కల్లెడి, గుత్ప తదితర గ్రామాలుండేవి.

దోమకొండ సంస్థానం

ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్నది దోమకొండ. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందజం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.

హైదరాబాదు రాజ్యం యొక్క బీదరు సుబాలో ఇందూరు జిల్లాగా ఉంది. 1905లో ఇందూరు తాలుకాలోని నిర్మల్, నర్సాపూరు= తాలూకాలను కొత్తగా ఏర్పడిన అదిలాబాదు జిల్లాలో చేర్చారు. మధోల్ తాలూకా మరియు బాన్స్‌వాడలోని కొంతభాగం నాందేడ్ జిల్లాలో చేర్చారు. మిగిలిన బాన్స్‌వాడ తాలూకాను యెల్లారెడ్డి, బోధన్ తాలుకాలోకి చేర్చారు. భీంగల్‌ను ఆర్మూరు తాలూకాలో కలిపి, యెల్లారెడ్డిపేట, కామారెడ్డిపేట తాలూకాలో మరికొన్ని మార్పులు చేసి కొత్తగా ఏర్పడిన జిల్లాకు నిజామాబాదు జిల్లాగా నామకరణం చేశారు.[2] జిల్లా ఏర్పడినప్పుడు ఐదు తాలూకాలుండేవి - ఇందూరు, ఆర్మూరు, కామారెడ్డి, యెల్లారెడ్డి, బోధన్. 1930వ దశకంలో యెల్లారెడ్డి, బోధన్ తాలూకాల నుండి బాన్స్‌వాడ తాలూకాను తిరిగి ఏర్పరచారు.

1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటినది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని ఐతే హైదరాబాద్ నగరం దాటిని కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు


పుణ్య క్షేత్రాలు

జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో లింబాద్రి గుట్ట, బడా పహాడ్, బిచ్కుంద మరియు సారంగాపూర్ మొదలైనవి ఉన్నాయి.

లింబాద్రి గుట్ట
లింబాద్రి గుట్టపై ప్రశాంత వాతావరణములో శ్రీ నరసింహ స్వామి ఆలయము నెలకొన్నది. ఈ ప్రదేశము భీంగళ్ నుండి 4 కిలోమీటర్ల దూరములో ఉంది. ప్రతి సంవత్సరము కార్తీక సుద్ధ తదియ నుండి త్రయోదశి వరకు ఇక్కడ ఉత్సవము జరుగును దినినీ నింబాచలం అని కూడా పిలుస్తారు. పచ్చని కొండల మధ్య ఎంతో అహ్లాదంగా ఉంది

బడా పహాడ్
వర్ని మరియు చండూరు మధ్య ఉన్న బడా పహాడ్ పైన సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గాలో అనేక మంది ప్రజలు శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము జాతర కూడా జరుగును.

సారంగాపూర్
నిజామాబాదు నుండి 8 కి.మీ.ల దూరంలో ఉన్న సారంగాపూర్ వద్ద హనుమంతుని దేవాలయం ఉంది. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు, దాదాపు 452 ఏళ్ళ కిందట ఈ ఆలయానికి శంకుస్థాపన చేసాడు. చక్కటి రవాణా సౌకర్యాలతో, భక్తులకు అవసరమైన వసతి వంటి అన్ని సౌకర్యాలు ఈ ప్రదేశం కలిగి ఉంది.

శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవాలయం
దక్షిణ కాశిగా పేరుగాంచిన, ప్రసిద్ధ శ్రీ భిక్కనూరు సిద్దరామేశ్వర స్వామి దేవాలయం, నిజామాబాదు నుండి 70 కిలోమీటర్ల దూరములో భిక్కనూరు మండల కేంద్రంలో ఉంది.

శ్రీ కాలభైరవస్వామి దేవాలయం
ఎంతో ప్రాచుర్యం కలిగిన శ్రీ కాల భైరవస్వామి దేవాలయం, సదాశివనగర్ మండలం, ఇస్సన్నపల్లి గ్రామంలో వుంది.

కంఠేశ్వర్
ఈకంఠేశ్వర్ వద్ద ఉన్న నీలకంఠేశ్వరుని రూపంలో ఉన్న శివుని దేవాలయం పురాతనమైనది. ఉత్తర భారత వాస్తు శైలిలో ఉండే ఈ ఆలయాన్ని శాతవాహన చక్రవర్తి యైన రెండవ శాతకర్ణి జైనుల కొరకు కట్టించాడు. రథసప్తమి పండుగను ప్రతి ఏటా పెద్దెత్తున జరుపుతారు.

డిచ్ పల్లి రామాలయం
క్రీ.శ. 1600 ప్రాంతంలో విజయనగర రాజులు డిచ్ పల్లి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 76 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషీ, గోపురాలపై ద్రావిడుల ప్రభావం కన్పిస్తుంది. విజయనగర రాజుల శిల్ప రీతి కనిపించడంతో 16వ శతాబ్దం మధ్య కాలంలో రామరాయల హయాంలో నిర్మించి ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్మాణం మొత్తం చాలావరకు నల్లరాయితో జరిగింది. ఈ దేవాలయానికి ఎదురుగా చెరువు మధ్యలో నిర్మించిన మండపం ప్రత్యేక ఆకర్షణ.

ఖిల్లా రామాలయం
ఇందూరు, ఇంద్రపురి అనేపేర్లు కలిగిన నిజామాబాదు పట్టణాన్ని, ఇక్కడి కోటను రాష్ట్రకూటులు నిర్మించారు. వారి కాలంలోనే నిర్మించిన 40 అడుగుల ఎత్తున్న విజయస్థూపం కూడా ఇక్కడ ఉంది. క్రీ.శ. 1311లో ఈ కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించాడు. తరువాత అది బహమనీ రాజుల చేతుల్లోకి, ఆపై కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీల చేతుల్లోకి వెళ్ళింది. విశాలమైన ఈ కోట రాతి గోడలతో, నాలుగు మూలల బురుజులతో ఉంది. క్రీ.శ.10 వ శతాబ్దపు ఈ రాష్ట్రకూటుల కోట ప్రస్తుతం ఆసఫ్ జాహీ ల శైలిలో విశాలమైన గదులతో ఉంది. కోటలో సమర్థ రామదాసు నిర్మించిన బడా రామాలయం మరో ఆకర్షణ.

కంజర్లో కూడా హనుమంతుని దేవాలయం ఉంది. ఈ గుడి 1843లో నిర్మించబడ్డది.

Nizamabad Map:


మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి