Children's Day 2017: Yergatla

Children's Day 2017: Yergatla


ఈ రోజు ఏర్గట్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో బాలల దినోత్సవం రోజు (Children's Day) సందర్భముగా బాలల హక్కుల సంరక్షణ గ్రామా సభ సర్పంచ్ శివన్నోల్ల వైష్ణవి అద్యక్షతనమున జరిగింది. సర్పంచ్ శివన్నోల్ల వైష్ణవి మాట్లాడుతూ ప్రభుత్వ చట్టం ప్రకారం గ్రామములో పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను జీతము పనిలో పెట్టకుండా ప్రతి పిల్లాడిని బడికి పంపి చదివించే బాధ్యత తల్లిదండ్రుల పైన యుందని అలాగే పిల్లలను నిర్బంధించి హింసించిన స్వేచ్ఛకు భంగం కలిగించిన మరియు హక్కులను గౌరవించకున్న చట్టబద్ధముగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని మన రాజ్యాంగములో యుందని చెప్పటానికే ఈ గ్రామసభ ఏర్పాటు చేసారని సర్పంచ్ వైష్ణవి అన్నారు. 

ఇట్టి గ్రామసభలో కార్యక్రమములో సెక్రటరీ గంగాదాస్, వార్డ్ సభ్యులు సున్నపు గంగయ్య, కొమ్ముల రత్న, కామని శివ, అంగనివాడి టీచర్స్ శారదా, చంద్ర కళ, సుజాత, సులోచన, శోభా, ఆశ వర్కర్స్ మరియు జిపి సిబ్బంది , ప్రజలు తదితరులు పాలుగోన్నారు. ( 14-11-2017 )

మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి